Saturday, November 15, 2025
HomeTop StoriesPrivate Colleges: నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్‌.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల నిర్ణయం

Private Colleges: నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్‌.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల నిర్ణయం

Private Colleges Bandh Due to Fee Reimbursement: రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్‌ పాటించనున్నట్టుగా తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంద్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాయి. ఈ మేరకు నేటి నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది.
ప్రైవేట్‌ కళాశాలలకు హామీ: 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యాసంస్థలు నిరసనలు చేపట్టాయి. అయితే ఈ మొత్తంలో రూ. 1200 కోట్లు రెండు విడతల్లో ఇస్తామని దసరా సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మిగతా రూ. 7,200 కోట్లను కూడా మార్చి 2026 నాటికి చెల్లించేలా ప్రభుత్వం ప్రైవేట్‌ కళాశాలలకు హామీ ఇచ్చింది.

 

- Advertisement -

Also read:Fee Reimbursement-రేపటి నుంచి ప్రైవేట్‌ కళాశాలల బంద్‌.. దశల వారీగా ఉద్యమాలుFee Reimbursement-రేపటి నుంచి ప్రైవేట్‌ కళాశాలల బంద్‌.. దశల వారీగా ఉద్యమాలు

చలో సెక్రటేరియట్: మొదటి విడతలో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. మిగిలిన రూ. 900 కోట్లను దీపావళి నాటికి చెల్లించాల్సి ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి సమాఖ్య విజ్ఞప్తి చేసింది. నవంబర్‌ 1 కి డెడ్‌లైన్‌ విధించింది. నవంబర్‌2 న సానుకూల నిర్ణయం తీసుకుంటే బంద్‌ నిర్ణయాన్ని విరమించుకుంటామని తెలిపింది. అయితే నిన్న కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చించిన యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌ చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 6న లక్ష మంది సిబ్బందితో సభ, 10 వ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్, ‘చలో సెక్రటేరియట్’ వంటి కార్యక్రమాలకు సిద్ధమైనట్లు యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ నెల 4 న మంత్రులకు రిప్రజెంటేషన్‌ ఇస్తామని తెలిపాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad