అధికారిక కార్యక్రమంలో మోడీ రాజకీయాలు మాట్లాడారని మండిపడ్డారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్,వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం. తెలంగాణ పై మోడీ కి ప్రేమ లేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు మంత్రులు. వందే భారత్ రైళ్ల ను మోడీ ఎన్ని సార్లు ప్రారంభిస్తారన్న తలసాని, అభివృద్ధిని రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఎలా అంటారన్నారు. అసలు కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికి అంటూ తలసాని, గంగుల మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తోందని వారు నిలదీశారు. తలసరి ఆదాయం లో తెలంగాణ నెంబర్ వన్ కాదా మోడీ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ లో కుటుంబ రాజకీయాలు లేవా, బీజేపీ సీఎంలు అవినీతిలో కూరుకు పోతే విచారణలు ఎందుకు ఉండవు, .దేంట్లో తెలంగాణ వెనకబడిందో మోడీ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి కాదు.. కనీసం సికింద్రాబాద్ కు ఏమైనా చేశారా, మోడీ బాధ్యతా రహిత్యంగా మాట్లాడారన్నారు. మోడీ మమ్మల్ని తిట్టాలనుకుంటే ఢిల్లీ లో ఉండి తిట్టుకోవచ్చు, దానికి హైదరాబాద్ రావాలా అన్నారు. ప్రధాని వస్తే సీఎంలు స్వాగతం పలకాలని ఏ చట్టంలో ఉందన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మోడీ అనలేదా అని గుర్తుచేశారు.