అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ లక్ష్మి ముల్కనూర్ సర్పంచ్ జానకిరాణి ఎంపీటీసీ వెంకట్ లాల్ లు పేర్కొన్నారు. గార్ల మండల పరిధిలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో వారు పాల్గొని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి మాట్లాడారు. మెరుగైన పాలనలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రజా పాలన పేరుతో అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు.
ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు ఇస్తున్న అర్జీలకు రేషన్ కార్డు ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను మాత్రమే జత చేయాలన్నారు. ప్రజా పాలన గ్రామసభలో దరఖాస్తులు సమర్పించలేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్ ఎంపీ ఓ రజిని మండల స్థాయి అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు