Saturday, November 23, 2024
HomeతెలంగాణPuvvada foundation: ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

Puvvada foundation: ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

రవాణా మంత్రి పువ్వాడ చొరవ

ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను అందించనున్నారు. ఈ మేరకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో Vdo’s కాలనీ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాల నిండిన వారు టూ, త్రీ, ఫోర్ వీలర్ కోసం స్లాట్ బుక్ చేసుకుని ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ను అందుకోవాలని కోరుతూ మంత్రి క్యాంపు కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, RTO కిషన్ రావు, జిల్లా RTA మెంబర్ వల్లభనేని రామారావు, RJC కృష్ణ, BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, AMVI రాంప్రసాద్, వీరు నాయక్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ యువతను దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జూలై 7 నుండి సెప్టెంబర్ 23వరకు(21వ తేదీ నుండి 23 వరకు రఘునాథపాలెం మండలం) ఈ లైసెన్స్ మేళాలో 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ మేళా ద్వారా క్యాంపు కార్యాలయంలో ధరఖాస్తు చేసుకుని ఆ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు.ముఖ్యంగా విద్యార్థులు, చిరు వర్తక, వ్యాపారులు, నిరుద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్ లు తప్పక తీసుకోవాలన్నారు.వాటికి అయ్యే లైసెన్స్ ఫీజ్ పువ్వాడ ఫౌండేషన్ భరిస్తుందని డివిజన్ లోని దరఖాస్తుదారునుకు ఆయా డివిజన్ కార్పొరేటర్ ల అధ్వర్యంలో మీకు కేటాయించబడిన తేదీల్లో వచ్చి లైసెన్స్ కు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకుని మరుసటి రోజుకి స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ తేదీన జిల్లా RTA కార్యాలయంలో ఉదయం ఫోటో దిగి, డిజిటల్ సంతకం చేసి సాయంత్రం ఆయా లేర్నర్ లైసెన్సు(LR) ధృవ పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో తీసుకోవాలని తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయు వాహనదారుల వారికి ఆటో, కార్ ,టూవీలర్ నడిపే వారు డ్రైవింగ్ లైసెన్సులు కానీ ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు ప్రమాదాలు జరిగిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కనీసం వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో కూడా లేని పేదలు అనేక మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు.అలాంటి వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందు చూపుతూ పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకునే విధంగా ఎలాంటి చదువు సర్టిఫికెట్స్ లేకపోయినా కేవలం ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ద్వారానే వారికి లైసెన్స్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు.చిరునామా కోసం ఆధార్/ ఓటర్ కార్డ్/ బ్యాంక్ పాస్ బుక్/పాస్ పోర్ట్ (ఏదైనా ఒకటి), పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదవ తరగతి ధృవ పత్రం/పాన్ కార్డు/పాస్ పోర్ట్ (ఏదైన ఒకటి) ద్వారా ఈయొక్క అవకాశాన్ని లైసెన్స్ లేని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News