నా బలం నా ప్రజలు, నా కార్యకర్తలే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 24వ డివిజన్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని నీచ రాజకీయాలు చేసినా.. ఎంత మంది కట్టప్పలు వచ్చినా చివరికి గెలిచేది బాహుబలి అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకు అన్ని తెలుసని, ప్రజలు ఎవరితో ఉండాలి.. ఎవరు అభివృద్ది చేస్తారు.. ఎవరు మనకు అందుబాటులో ఉంటారు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసిన ప్రజలు నాతోనే ఉన్నారన్న విషయం మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది.. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం వచ్చింది అంటే అది ప్రజలపై పై ఉన్న నమ్మకంతోనే వచ్చింది అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని, ఇక ముందు రావని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం కరెంట్ ఉండెనా.. రోడ్లు ఉన్నాయా.. ఇంటింటికీ త్రాగునీరు ఉన్నాయా.. మూరుకి కూపం తప్ప ఏముంది ఖమ్మంలో..ఇవ్వాళ ఎలా ఉంది ఖమ్మం.. చెప్పాలన్నారు.
ఒకప్పుడు ఇదే ఖమ్మం నగరంలో త్రాగునీటి కోసం రోడ్ల మీద నల్లాల వద్ద మహిళలు కొట్టుకున్న సంఘటనలు మార్చిపోయారా.. మహిళలు మీరే చెప్పాలి ఇది వాస్తవమే నా కదా..? అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం పదవులు అనుభవించి, ఒకరిపై ఇంకొకరు కొట్టుకోవడం తప్ప ఏం చేశారు మీరు..?
ఖమ్మంను అంటి పెట్టుకొని ప్రజలకు కావాల్సిన ఒక్కో పని ఒక్కోక్కటిగా చేసుకుంటూ వచ్చినం కాబట్టే నేడు ఇంత అభివృద్ది జరిగింది అన్నారు. ఇంటింటికీ త్రాగు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఖమ్మం నగరంలో 24 ఓవర్ హెడ్ ట్యాంక్ లు నిర్మాణం చేయడం జరిగింది అని అన్నారు. నా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినా.. వారి జోలికి వచ్చినా మూల్యం చెల్లించుకుకుంటావ్ జాగ్రత్త.. అని హెచ్చరించారు. 24వ డివిజన్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ అబ్దుల్ రెహమాన్, సెక్రటరీ గోలి రామారావు మాట్లాడుతూ.. డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన దరిమిలా వారితో మాకేం సంబంధం లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాలు నెరవేరలేదు అన్న నెపంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద బురదజల్లి వెళ్ళిపోయారే తప్ప మేమంతా అజయ్ అన్నతోనే ఉన్నామని వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో తామంతా కలిసి కట్టుగా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని స్పష్టం చేశారు.
నాడు కార్పొరేటర్ అభ్యర్థి గా ప్రకటించిన నాటి నుండి మా రెక్కల కష్టం మీద ఇంటింటికీ వెళ్ళి BRS ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం ను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిపించుకున్నామని వివరించారు. మేమందరం కలిసికట్టుగా పని చేస్తేనే ఆయన కార్పొరేటర్ గా గెలిచాడు.. పోయింది వ్యక్తి మాత్రమే.. పార్టీ ఎక్కడికి పోలెదని క్యాడర్ మొత్తం అజయ్ అన్న వెంటే ఉన్నామన్నారు.
ఇక్కడ అనేక పనులు, పైరవీలు చేసుకుని, స్వలాభం పొంది జారుకున్న వ్యక్తి ని డివిజన్ లో ప్రజలు నమ్మబొరని అన్నారు. శ్రమ మాది.. కార్పొరేటర్ హోదా తనది… బీఆర్ఎస్ పేరు చెప్పుకుని గెలిచిన వ్యక్తి నేడు అదే ప్రజల ముందు తల ఎత్తుకుని తిరగగలడా? రానున్న ఎన్నికల్లో గత మెజారిటీ కంటే అధిక మెజారిటీని ఇచ్చి ఇక్కడ అజయ్ అన్నను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. డివిజన్ నాయకుడు పిల్లి విజయ్ పాల్ అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, పారా ఉదయ్ కుమార్, అమరాగాని వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, మక్బూల్, పల్లాలీన, నాయకుడు మాజీ కార్పొరేటర్ మందడపు మనోహర్, షకీనా ,డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సూరపనేని శేషగిరి బాబు, యూత్ అధ్యక్షుడు పేశెట్టి మనోహర్, మైనార్టీ నాయకుడు తాజ్ఉద్దీన్, యూత్ సెక్రటరీ అనిల్, యూత్ వైస్ ప్రెసిడెంట్ అస్లాం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కడారి వెంకన్న, ఎస్సీ సెల్ సెక్రెటరీ చందు, నాయి బ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ గాద శీను, డివిజన్ బీసీ సెల్ సెక్రెటరీ రేగళ్ల నాగరాజు, డివిజన్ మహిళా అధ్యక్ష, కార్యదర్శులు రామలక్ష్మి, నాగలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కవిత, మైనార్టీ సెక్రటరీ అమీర్ పాషా తదితరులు ఉన్నారు.
Puvvada: నా బలం నా ప్రజలు
కాంగ్రెస్ వాళ్లు కొట్టుకోవటం తప్ప ఏం చేశారు?