రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం నగరంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైనా 34 మంది లబ్ధిదారులకు గాను రూ.34.03 లక్షల చెక్కులను, చీరలను మంత్రి పువ్వాడ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ గారి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.
పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొలు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.