Python Died After Swallow Monkey : కొన్ని సందర్భాల్లో కొండ చిలువలు.. కోళ్లు, మేకలు, పశువులు, మనుషులను మింగి చంపేస్తాయి. అయినా ఆ కొండ చిలువలకు ఏం కాదు. కానీ ఓ కోతిని మింగిన కొండ చిలువ అక్కడికక్కడే మరణించింది. అయితే దాని మరణానికి గల కారణాలేంటీ..? దాన్ని చూసిన గ్రామస్థులు భయంతో ఎందుకు పరుగులు పెట్టారో తెలుసుకుందాం!
కొండ చిలువ మనిషులను సైతం మింగేయగలదు. ఎంతటి మనషినైనా చుట్టేసి.. పిండి చేసే సత్తా ఆ పాములకు ఉంటుంది. దాని పట్టు నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు. అందుకే అడవిలో ఉండే పలు జంతువులు దానికి ఎదురెళ్లడానికే భయపడిపోతాయి. కానీ ఓ కోతి మాత్రం.. ఆ పాము నోటికి చిక్కి విలవిల్లాడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన చొప్పరి రవీందర్ ఇంటి ఆవరణలోకి సోమవారం ఏడు అడుగుల పొడవైన కొండచిలువ వచ్చింది.
అయితే అదే ప్రాంతంలో ఓ కోతుల గుంపు తిరుగుతుంది. అది గమనించిన కొండ చిలువ.. ఆ గుంపులోని ఓ కోతిని మింగడానికి నోటితో పట్టుకుంది. దీంతో ఆ కోతి ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో కోతుల మంద గట్టిగా అరుస్తూ పాము చుట్టూ చేరాయి. అన్ని కోతులు కలసి కొండచిలువపై దాడికి దిగాయి. అయినప్పటికీ విడవకుండా కోతిని పూర్తిగా కొండ చిలువ మింగేసింది. దీంతో ఆగ్రహించిన కోతుల గుంపు .. కొండచిలువపై ముప్పేట దాడి చేసి చంపేశాయి. అయితే ఈ ఘటనను చూసిన .. స్థానిక గ్రామస్థులు మాత్రం భయంతో పరుగులు పెట్టారు.


