Friday, September 20, 2024
HomeతెలంగాణQutubullapur: జోరుగా కొలను ప్రచార హోరు

Qutubullapur: జోరుగా కొలను ప్రచార హోరు

రోడ్ షో, బైక్ ర్యాలీలతో ప్రచారం

కుతుబుల్లాపూర్ లో కొలను హనుమంత రెడ్డి ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్ షో చేసిన ఆయన తరపున బైక్ ర్యాలీే కూడా చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 130 డివిజన్ వెంకటేశ్వర నగర్ వద్ద పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో రోడ్ షో ను ప్రారంభించి ఇంద్రసింగ్ నగర్, వాణి నగర్, మహేంద్ర నగర్, సుదర్శన్ రెడ్డి నగర్, KMG కాలనీ, ప్రతాప్ ఎస్టేట్స్ మాణిక్య నగర్ మీదుగా మార్గ మద్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ద్వారకా నగర్, డి నగర్, గణేష్ నగర్, కల్పన సొసైటీ మీదగా చెరుకుపల్లి కాలనీ నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా, శ్రీనివాస నగర్ మార్కెట్ రోడ్ గుండా సంజీవయ్య నగర్ మీదుగా బాలిరెడ్డి నగర్ చౌరస్తా నుండి పద్మ నగర్ దగ్గర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ లను గురించి ప్రజలకు వివరించి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమస్యలు అన్నిటిని తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఎన్టీఆర్ నగర్ మీదుగా పాపయ్య యాదవ్ నగర్, రాంరెడ్డి నగర్ తర్వాత సూర్య నగర్ వద్ద రోడ్ షో ముగిసింది.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు KP విశాల్ గౌడ్, INTUC నాయకులు చింతల నాగరాజు, ఆనంద్ రావు,131డివిజన్ SC సెల్ అధ్యక్షులు బింగి లక్ష్మి నారాయణ,131డివిజన్ అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు జాకీర్, డివిజన్ సీనియర్ నాయకులు జెస్సీ పాల్, మైనార్టీ నాయకులు నబీల్ త, హఫీజ్ భాయ్, ఖయ్యుమ్, అజీజ్, అన్వర్, భాస్కర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఈశ్వర్, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు రంగమ్మ, సుజాత, విజయ్ భాస్కర్, రాధాకృష్ణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్, నూతన్, బాలరాజ్, సంగీత, అంకిత, ఖయ్యూమ్, వసంత్, నబీల్ థాయ్, ప్రదీప్, వసంత్, వెంకట్, సుజాత, లక్ష్మారెడ్డి, రాజు, వీరేష్, సంగమ్మ, మైనారిటీ అధ్యక్షులు హఫీజ్, అర్జున్, శ్రీనివాస్, వెంకట్రావ్, నాగార్జున, సిద్దు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News