75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) చీఫ్ ఇంజనీర్ బి .రఘు బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర విశిష్టతను వివరిస్తూ పౌరులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక అంశాల్లో స్వేచ్ఛ ఉందన్నారు. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల రక్తం, చెమటతో కూడిన పోరాటంతో ఇది సాధ్యమైందని గుర్తుచేశారు. దేశం పట్ల అంకితభావం తోబాటు నిబద్ధత భావి తరాలకు ఉజ్వలమైన బాటలు వేసిన స్వాతంత్ర సమరయోధుల నుండి యువకులు స్ఫూర్తి పొందాలని కోరారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ స్థాపనను సూచిస్తుందన్నారు.