Thursday, December 5, 2024
HomeతెలంగాణR Krishnaiah : స్కాలర్‌షిప్‌ బిల్లులు చెల్లించండి

R Krishnaiah : స్కాలర్‌షిప్‌ బిల్లులు చెల్లించండి

తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల స్కాలర్‌షిప్‌ బిల్లులు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ ఆర్.క్రిష్ణ‌య్య (R Krishnaiah) డిమాండ్ చేశారు. స్కాల‌ర్‌షిప్ బిల్లులు వెంటనే చెల్లించ‌క‌పోతే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తరహా మరో విద్యార్ధి ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆద్వర్యంలో హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బీసీ భ‌వ‌న్‌లో విద్యార్థుల ఫీజుల దీక్ష జరిగింది. ఈ దీక్ష‌కు ముఖ్య అతిథిగా ఆర్.క్రిష్ణ‌య్య హాజ‌రై మాట్లాడారు.

- Advertisement -

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ తదితర కాలేజీ కోర్సులు చదువుతున్న 16 లక్షల 75 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొందరు విద్యార్థులు రక్తాన్ని, కిడ్నీలను అమ్ముకొని బకాయిలు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆర్.క్రిష్ణ‌య్య (R Krishnaiah) హెచ్చరించారు.

ఈ దీక్ష కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామ‌క్రిష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయ‌కులు నీల వెంకటేష్, సి.రాజేందర్, నందగోపాల్, అనంతయ్య, పి.సుధాకర్, ఉదయ్ నేత, మధుసూదన్ రావు, రవి కుమార్ యాదవ్, పృధ్వీ గౌడ్, అరవింద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News