Thursday, December 12, 2024
HomeతెలంగాణRachakonda CP: మోహన్ బాబు కుటుంబం వివాదం.. రాచకొండ సీపీ ఏమన్నారంటే..?

Rachakonda CP: మోహన్ బాబు కుటుంబం వివాదం.. రాచకొండ సీపీ ఏమన్నారంటే..?

Rachakonda CP: సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం గొడవల విషయంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Sudheer Babu) స్పందించారు. ఈ వివాదంలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ గొడవలు వారి వ్యక్తిగతమని.. అయితే వారి వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందున ముగ్గురికీ నోటీసులు ఇచ్చామని తెలిపారు.

- Advertisement -

ఇకపై మోహన్ బాబు(Mohan Babu) ఇంటి పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండటానికి వీల్లేదని చెప్పామని వివరించారు. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీసులకు సూచించామన్నారు. ఇక తమ నోటీసులకు స్పందించి విష్ణు, మనోజ్ తన ఎదుట హాజరయ్యారని చెప్పారు.

గొడవలు పెట్టుకోకుండా మనోజ్‌ లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను సంవత్సరం పాటు బైండోవర్ చేస్తూ ఆదేశాలిచ్చామన్నారు. మరోవైపు బైండోవర్ నోటీసుకు విష్ణు కొంత సమయం కోరారని.. ఈ నెల 24వ తేదీ వరకు ఆయనకు సమయం ఇచ్చామని వెల్లడించారు. కాగా గత నాలుగు రోజులుగా మంచు కుటుంబం గొడవలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News