Saturday, November 15, 2025
HomeతెలంగాణRaghunandan Rao Delhi blast BJP Criticism : "ఢిల్లీ పేలుళ్లతో మాకేం సంబంధం" -...

Raghunandan Rao Delhi blast BJP Criticism : “ఢిల్లీ పేలుళ్లతో మాకేం సంబంధం” – రఘునందన్ ఫైర్

Delhi blast BJP Criticism Raghunandan Rao Reaction: ఢిల్లీలో ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. బీజేపీకి ఈ పేలుళ్లకు సంబంధం ఉందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్ర దేశద్రోహమని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ‘సర్దార్ ఏక్తా పాదయాత్ర’లో మాట్లాడుతూ, “చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే పేలుళ్లు జరుగుతాయని, దీని వెనుక బీజేపీ ఉందని నీచంగా మాట్లాడుతున్నారు. అసలు బాంబు పేలుళ్లకు, బీజేపీకి ఏం సంబంధం?” అని ప్రశ్నించారు.

పేలుడు ఘటనలో 12 మంది మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. NIA దర్యాప్తులో 200 IED బాంబులు, 26/11 తరహా కుట్ర అని తేలింది. జైష్-ఎ-మహ్మద్ (JeM) పాక్ ఆధారంగా పని చేస్తోందని అనుమానం వ్యక్తమవుతుంది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, గౌరీశంకర్ ఆలయం, రైల్వే స్టేషన్లు, మాల్స్ టార్గెట్‌లిస్ట్‌లో ఉన్నాయి అని తేలింది. రఘునందన్ రావు, “ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి, ఒక పార్టీపై బురద చల్లడం దారుణం. ఇలాంటి వారి విజ్ఞతకు వదిలేస్తాము. ప్రజలే ఇలాంటి వారికి సరైన సమాధానం చెప్తారు” అని హెచ్చరించారు.

ఇక పేలుడు ఘటనపై NIA 10 మంది బృందంతో దర్యాప్తు చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్, హర్యానా, UP పోలీసుల నుంచి డైరీలు తీసుకుని, ఫైనాన్స్, ఆపరేషన్‌లు చెక్ చేస్తున్నారు. బుధవారం IB చీఫ్‌తో NIA DG భేటీ అయ్యారు. ఇటీవల J&Kలో 2,900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ నుంచి 40 నమూనాలు సేకరించారు. అమ్మోనియం నైట్రేట్ బయటపడింది. దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad