CM Revanth Reddy: రాహుల్ తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎల్లప్పుడూ చదువులో ముందుండే ఈ కుర్రోడు ఎలాగైనా ఐఐటీలో సీటు సంపాదించి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడలాని కలగన్నాడు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరోలా చేస్తుంటుంది కొన్నిసార్లు.
తన కలలను నిజం చేసుకునేందుకు రాహుల్ ఐఐటీ ఎంట్రెస్ పరీక్షలకు ప్రెపేర్ అవుదామని రాజస్థాన్ లోని కోఠా ప్రాంతానికి వెళ్లాడు. అయితే కోఠాకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అతడిపై కొందరు దుండగులు దాడిచేసి రైలు నుంచి కింద పడేశారు. ఈ ప్రమాదంలో రాహుల్ రెండు కాళ్లు కోల్పోయాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో అతనికి నిమ్స్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ లింబ్స్ అందజేసింది.
ఆర్టిఫీషియల్ లింబ్స్ అందించటానికి అవసరమైన రూ.10 లక్షలను సీఎం రేవంత్ రెడ్డి అందించటంతో తిరిగి రాహుల్ నడవటం ప్రారంభించాడు. తనలోని ఆశలను కలలకు తిరిగి ప్రాణం పోసేందుకు కొత్త జీవితాన్ని తిరిగి స్టార్ట్ చేసేందుకు ఇది దోహదపడనుంది. రేవంత్ రెడ్డి సహాయానికి రాహుల్ కుటుంబం కృతజ్ఞతలు చెప్పటంతో పాటు ఆయన సహాయానికి రుణపడి ఉంటామని చెబుతోంది. ఒక్క ప్రమాదంలో జీవితం మెుత్తం తలకిందులై ఆశలు సమాధి అవుతున్నాయి అనుకున్న స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సాయం తమకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయని ఆ కుటుంబం చెప్పింది.


