Friday, November 22, 2024
HomeతెలంగాణRahul Gandhi: ప్రజల మేలు కోరి తెలంగాణ ఇచ్చాం

Rahul Gandhi: ప్రజల మేలు కోరి తెలంగాణ ఇచ్చాం

అధికారంలోకి రాగానే గ్యారెంటీలన్నీ అమల్లోకి

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో కాంగ్రెస్ విజయభేరి మహాసభకి భారీగా తరలి వచ్చారు జనం. రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర లింగేశ్వర స్వామిని దర్శించుకొని .. రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ప్రజల కోసం 6 గ్యారెంటి పథకాలను ప్రవేశపెట్టామని, యూనివర్సిటీలో ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని వీరు తమ ప్రసంగాల్లో వాపోయారు.

- Advertisement -


ఈ రాష్ట్రంలో పేదల కోసం ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం ఓటు వేసి తీర్షుకోవాలని, BRS పార్టీ సోనియమ్మకు మోసం చేసి వందల కోట్లు రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

ములుగు జిల్లాకి రాగానే రామప్ప దేవాలయం దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా వుంది అని అన్నారు. సోనియా గాంధి తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని, శ్రీకాంత్ చారి ఆత్మహత్య నాకు చాలా బాధ వేసిందని ఆమె అన్నారు. పూలే కొమురం భీమ్ అంబేత్కర్ లాంటి గొప్ప వీరుల త్యాగం మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నష్టం జరుగుతందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చినది కానీ BRS పార్టీ వారు రాజకీయం చేస్తున్నారు. గిరిజనులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 12% రిజర్వేషన్ ఇస్తాం.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ..

ప్రజల మేలు కోరి మేము తెలంగాణ ఇచ్చాం. ఇచ్చిన మాట నిలంట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమంటూ రాహుల్ ప్రసంగం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రింద మీ జేబుల్లో నుండి కోట్ల రూపాయలు దోసుకున్నారని రాహుల్ ఆరోపించారు. రాజస్థాన్ లో అన్ని ఆరోగ్య సమస్యలకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ఛత్తీస్ గడ్ లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరికి ఎక్కువ ధర ఇస్తున్నట్టు రాహుల్ పేర్కొన్నారు.


BRS ప్రభుత్వం మీ దగ్గర తీసుకున్న అసైన్డ్, పోడు భూములను మేము ఇప్పిస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చెప్పిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపిస్తాం. సమ్మక సారక్క జాతర కు మేము జాతీయ హోదా ఇస్తాం. BRS, BJP రెండు ఒకటే ఇందులో MIM కూడా కలిసి పోయింది. కేంద్రంలో BJP ఏది చేస్తే దానికి BRS మద్దతు తెలిపారు దీనికి ఉదాహరణ మా పైన ED, CBI దాడులు జరిపించారు.. కానీ కెసిఆర్ మీద ఏ ఒక్క దాడి చేయలేదు. బీజేపీని ఒడించాలి, బీజేపీ బీ టీమ్ బీ ఆర్ ఎస్ నీ ఓడించాలి అని రాహుల్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News