రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వములో గోదావరిఖనిలో వేడుకలను యూనియన్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ మనుమడు, రాజీవ్ గాంధీ కుమారుడు భారత్ జోడో యాత్ర ద్వారా భారత దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు అతను దిక్సూచిగా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తన గమ్యం చేరుకోవడంలో విజయవంతం అయ్యాడన్నారు. ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేసి తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడన్నారు.
కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలను మభ్య పెడుతు కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ఏ రోజు ప్రజా సమస్యల్ని విన్న పాపాన పోలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని దేశ దశ దిశ మారుతుందని ఇది తథ్యమని వారన్నారు. వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంచార్జ్ వికాస్, రాజేందర్, శ్రీనివాస్, ఎట్టం కృష్ణ , సెంట్రల్ సెక్రెటరీ పోచయ్యా, అక్బర్ అలీ, తిరుపతి, మహేష్ బాబు , జగన్మోహన్ , సాగర్ , శ్రీనివాసులు , ఆంజనేయులు , తాటి రాజయ్య , అల్లావుద్దీన్ , గంగాధర్ , మార్కండేయ , సమ్మక్క , చారి , గణపతి దామోదర్ , సంపత్ , సలీం , గడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.