కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన రద్దైంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హనుకొండ(Hanumakonda) చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5.30గంటలకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని పేర్కొన్నాయి. రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ పర్యటన రదైంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.