రాజకీయాల్లో తమ ప్రత్యర్థులు కోపం, ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. ఈ విషయాల్లో వారితో పోటీ పడలేకపోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారత్ సమ్మిట్‌కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాన్ని అణచివేసే దూకుడు రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్నేళ్ల క్రితం తమ పార్టీ పూర్తి ఒంటరిగా, రాజకీయంగా చిక్కుకుపోయినట్లు భావించామని వెల్లడించారు. తమకు మీడియా సహా ఏదీ తమకు అనుకూలంగా లేదని అన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే తమ పార్టీ చరిత్రను గుర్తుచేసుకుని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ వివరించారు. ఈ పాదయాత్ర ద్వారా తాను అనేక విషయాలు నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.