Wednesday, March 26, 2025
HomeతెలంగాణRahul Gandhi: రాహుల్ పీవీకి నివాళి అర్పించలేదెందుకు? మండిపడ్డ పీవీ కుటుంబం

Rahul Gandhi: రాహుల్ పీవీకి నివాళి అర్పించలేదెందుకు? మండిపడ్డ పీవీ కుటుంబం

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కుటుంబం రాహుల్ గాంధీపై మండిపడింది. అసలు పీవీ సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఎందుకు ఘటించలేదని పీవీ కుటుంబ సభ్యులు తాజాగా అడుగుతున్నారు. న్యూఢిల్లీలో వాజ్ పేయితో సహా పలువురు ప్రముఖుల స్మృతి వనాలను సందర్శించి పుష్పాంజలి ఘటించిన రాహుల్ హైదరాబాద్ లోని పీవీ ఘాట్ కు ఎందుకు రాలేదని వారు అడుగుతుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న కుటిల రాజనీతి ఇలాంటి చేష్టలతో బహిర్గతం అవుతోందని పీవీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. నరసింహా రావు మనువడు ఎన్ వీ సుభాష్ ఈమేరకు తమ గోడును మీడియాతో వెళ్లబోసుకున్నారు. ఓవైపు ఢిల్లీలో వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా జస్ట్ ఓ టీ షర్టుతో స్మృతి వనాలను సందర్శించి ఢిల్లీ వాసులను రాహుల్ ఆశ్చర్యపరుస్తుండగా మరోవైపు ఇలాంటి ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక రాష్ట్ర కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News