Thursday, April 17, 2025
HomeతెలంగాణRahul Gandhi: నేడు హనుమకొండలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

Rahul Gandhi: నేడు హనుమకొండలో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హనుకొండ(Hanumakonda) చేరుకుంటారు. సాయంత్రం 5.30గంటలకు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి 7:30కు రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటనపై జోరుగా చర్చ జరుగుతోంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

కాగా కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో పెట్టిన నేపథ్యంలో త్వరలోనే భారీ బహిరంగ సభల నిర్వహణకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభలకు రాహుల్ గాంధీంతో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ పెద్దలు రానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News