సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల్లో భారీ కుంభకోణం జరిగిందని డీసీసీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖనిలో మీడియాకు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. గత నాలుగేళ్ళుగా వారసత్వ ఉద్యోగాల పేరిట కొందరు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాల ఉద్యోగాల కల్పనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పొందిన మహిళా ఉద్యోగాల పట్ల యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళలతో విధులు చెపుతున్నారని అన్నారు. సింగరేణిలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ బొగ్గు వెలికితీత పనులను మహిళా ఉద్యోగులతో చేయిస్తున్నారని అన్నారు. వెంటనే మహిళా ఉద్యోగులకు సముచిత పని స్థలాలలో పని కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.