Sunday, November 16, 2025
HomeతెలంగాణRaja Singh: మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి: రాజాసింగ్

Raja Singh: మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి: రాజాసింగ్

Raja Singh| మంచు కుటుంబం వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా స్పందించారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారని తెలిపారు. దీంతో అందులోని నిజానిజాలను బయట పెట్టడానికి సిద్ధమైన జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. అందుకే మోహన్ బాబు(Mohan Babu) ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గాయపడిన రిపోర్టర్‌ను కలవాలని రాజాసింగ్ హితవు పలికారు.

- Advertisement -

కాగా అనారోగ్యంతో గత రెండు రోజులుగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబును వైద్యులు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad