Telangana : తెలంగాణ బీజేపీ (BJP) లో అంతర్గత విబేధాలు మరింత ముదిరిపోతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh), పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జూన్ 30, 2025న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కారణం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావును నియమించడం. ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జూలై 11న పార్టీ ఆయన రాజీనామాను ఆమోదించింది. కానీ, రాజా సింగ్ ఇంకా హిందుత్వం కోసం పని చేస్తానని చెప్పారు.
ALSO READ: CPI Narayan Hot Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ “ఊసరవెల్లి”
తాజాగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ‘ఫుట్‌బాల్’ నిరసనకు మద్దతు ఇచ్చారు. కొండా, పార్టీలో తనను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారంటూ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇచ్చారు. దీనిపై రాజా సింగ్ వీడియో విడుదల చేసి, “విశ్వేశ్వర్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టారంటే ఫుట్‌బాల్ ఇచ్చారు” అని అన్నారు. మరిన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి నిరసనలు చేస్తారని జోస్యం చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజా సింగ్ ఘాటు విమర్శలు చేశారు. “నా నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తన మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. ఎందుకు జోక్యం?” అని నిలదీశారు. 11 ఏళ్లుగా సొంత పార్టీ నేతలు తనతో ‘ఫుట్‌బాల్’ ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సొంత నేతలతోనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
ALSO READ : Reservoirs flood alert : నిండిన గండిపేట.. మూసీకి పోటెత్తిన వరద.. పరివాహక ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక!
బీజేపీలో బయటి నేతలను చేర్చుకుంటున్నారని, కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. “కార్యకర్తలు ఎప్పటికీ లేబర్లుగానే ఉండాలా?” అని ప్రశ్నించారు. పార్టీ హైకమాండ్ తక్షణమే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాలు తెలంగాణ బీజేపీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పార్టీలో మరిన్ని మార్పులు రావచ్చు.


