Saturday, October 12, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: ఎనిమిదేళ్ల తరువాత ఇంటికి చేరిన మహిళ

Rajanna Sirisilla: ఎనిమిదేళ్ల తరువాత ఇంటికి చేరిన మహిళ

ఇల్లంతకుంట పోలీసుల చొరవ

ఖమ్మం జిల్లాకు చెందిన మతిస్థిమితం లేని, గుర్తు తెలియని మహిళను వారి కుటుంబ సభ్యులను గుర్తించి, ఆమెను అప్సజెప్పినట్లు ఇల్లంతకుంట ఎస్.ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ రాజు మాట్లాడుతూ తేదీ 28-4-2024 రోజున రాత్రి సమయంలో గాలిపల్లి గ్రామంలో ఒక గుర్తుతెలియని మహిళ వచ్చిందని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి డయల్ 100 కాల్ రాగా వెంటనే ఇల్లంతకుంట ఎస్.ఐ బ్లూ కోర్ట్ సిబ్బందిని గాలిపల్లి గ్రామానికి పంపించగా అక్కడ గుర్తు తెలియని మహిళ ఉందని గ్రహించారు. ఆమెను విచారించగా తన పేరు దోమల రాములమ్మ భర్త పుల్లయ్య అని తెలిపగా, వెంటనే ఆమెను సిరిసిల్లలోని సఖీ సెంటర్ కు పంపించారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగా కిష్టాపూర్ గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా వాసి అని తెలిపింది. వెంటనే ఇల్లంతకుంట ఎస్సై ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ వారికి, కిష్టాపూర్ గ్రామ పెద్దలకు ఇట్టి విషయం తెలుపగా ఆమె కూతురైన రమాదేవికి గుర్తు తెలియని మహిళ తన తల్లిగా గుర్తించి, రమాదేవి తన తల్లి ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయినదని ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండదని, తన తల్లి కోసం గత 8 సంవత్సరాల నుండి వెతుకుతున్నామని తెలిపింది. రమాదేవి సిరిసిల్ల సఖి సెంటర్ కు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిందని ఇల్లంతకుంట ఎస్.ఐ రాజు తెలిపారు. 8 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన తల్లిని గుర్తించి తమకు అప్పజెప్పిన ఇల్లంతకుంట పోలీస్ వారికి సఖి సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News