Sunday, October 6, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: రేపు సాయంత్రం ప్రచారం బంద్ చేయండి

Rajanna Sirisilla: రేపు సాయంత్రం ప్రచారం బంద్ చేయండి

48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ నెల 28 వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనున్న దృష్ట్యా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం ముగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగింపుకు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమా వేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని సూచించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలో ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 నుంచి సైలెన్స్ పిరియడ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 వరకు సైలెంట్ పీరియడ్లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు, ప్రచారానికి అనుమతి లేదన్నారు. సైలెన్స్ పీరియడ్ లో ఎలాంటి సర్వేలు, ఒపినియన్ పోల్స్, నాయకుల ఇంటర్వ్యూ, ఎన్నికల చర్చలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని, దినపత్రికల్లో వేసే ప్రకటనలకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ) ముందస్తు అనుమతి ఉండాలన్నారు. ఎవరైనా వ్యక్తులు లేదా పార్టీలు ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ఫలితాల వివరాలను వెల్లనించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం నిషేధించినందున అట్టి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎలక్ట్రో రోల్ చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 1(b) ప్రకారం సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయం నవంబర్ 30 సాయంత్రం ఐదు గంటలకు ముందు 48 గంటలు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల సమాచారం, ఒపీనియన్ పోల్, ఇతర పోల్ సర్వేల ఫలితాలను ప్రదర్శించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో మద్యం విక్రయాలకు పూర్తిగా నిషేధించడం జరిగిందని, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు ఆ సమయంలో విక్రయాలు జరపరాదని కార్యకలాపాలు మూసివేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వేరే నియోజక వర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జులు, గెస్ట్ హౌస్లు, హోటల్లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు 28న సాయంత్రం 5లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News