రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఉదయన్ సిన్హా జిల్లా కేంద్రానికి గురువారం రాత్రి చేరుకున్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్ వద్ద జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలకులకు మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలింగ్ పూర్తయిన సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ ఆయనకు వివరించారు.
Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్లకు చేరుకున్న ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఉదయన్ సిన్హా
ఏర్పాట్లను వివరించిన కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES