Friday, September 20, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: ధైర్యంగా ముందుకొస్తే వేెధింపుల నుంచి బయటపడొచ్చు

Rajanna Sirisilla: ధైర్యంగా ముందుకొస్తే వేెధింపుల నుంచి బయటపడొచ్చు

మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలి

సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ క్లబ్స్ అవగాహనా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ఈవ్టీజింగ్/ పోక్సో/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై , సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయిలపై ఎస్పీ అవగాహన కల్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు వేధింపుల నుండి బయటపడేందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మార్గమని, విద్యార్థినిలు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేధింపులకు సంబంధించి ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, టీచర్స్ కు గానీ తెలియజేయాలన్నారు. ఎవరైనా తమ పట్ల చిన్న తప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ముందుగానే గుర్తించి అలాంటి వారిని దూరంగా ఉంచాలన్నారు. జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీ డ్రెస్ లలో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు, పనిచేసే ప్రదేశాల్లో అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


మాదకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి, జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు కేటగిరి వారిగా నిర్వహించి అందులో గెలుపొందిన 96 మంది విద్యార్థులకి మండలాల వారిగా బహమతులు ప్రదానం చేశారు.

ప్రస్తుతం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలను దూరం ఉంచటంలో ప్రతిఒక్క విద్యార్థి భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ రఘుపతి, షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల,సి బ్బంది ప్రియాంక, రమాదేవి, శ్రీధర్, భరోసా సెంటర్ సిబ్బంది, కళాశాల, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News