ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ లు విక్రయిస్తున్న ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూల్ యెక్క మిని బస్ ను, గోదాంను పట్టుకుని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇల్లంతకుంట మండల యువజన సంఘాల నాయకుడు ఎం.రాజు పిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు స్పందించి మిని వ్యాన్ ను పోలిస్ స్టేషన్ కు తరలించి, పాఠ్యపుస్తకాలు ఉన్న గోదాంను మండల విద్యాధికారి బన్నాజి తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఏబీవీపీ, ఎన్ఎస్ యుఐ, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు అక్కేం నాగారాజు, మంద అనిల్, యశ్వంత్ అరవింద్, అనిల్, శివారమ్, దాసు, మహేందర్ తదితరులు ఉన్నారు.