రాజన్న సిరిసిల్ల జిల్లా కొండాపూర్, నారాయణపూర్ గ్రామాల్లో ఈ నెల 12, 18, 19 తేదీల్లో శ్రీ రేణుకా మాత జమదగ్ని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావుని గౌడ సంఘం తరపున ఆహ్వానించారు.