రెగ్యులర్ అయిన పలువురు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్ లు) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిశారు. 13 మంది జేపీఎస్ లు విధుల్లో చేరి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా వారు రెగ్యులర్ కాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను, డీపీఓ వీర బుచ్చయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ 13 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ సందర్భంగా జేపీఎస్ లను కలెక్టర్ అభినందించారు.
రెగ్యులర్ అయిన వారిలో లక్కిరెడ్డి సంపత్, హరిదాస్ నగర్ గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలం, గడ్డం దిలీప్ కుమార్ రెడ్డి, రుద్రారం ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములవాడ మండలం, జక్కని సుచిత, జై సేవాలాల్ ఊరు తండా కోనరావుపేట మండలం, జి లావణ్య అంకిరెడ్డి పల్లె గ్రామం తంగళ్ళపల్లి మండలం, తాళ్లపల్లి నీరజ పద్మనగర్ గ్రామం,తంగళ్ళపల్లి మండలం, ఆవారు నరేందర్ మల్యాల గ్రామం, చందుర్తి మండల, కొలుపుల రమ, నూకలమర్రి గ్రామం, వేములవాడ రూరల్ మండలం, దయాకర్ గోవర్ధనం గొల్లపల్లి గ్రామం, కోనరావుపేట మండలం,చిమ్మని సుస్మిత కోరుట్లపేట గ్రామం , ఎల్లారెడ్డిపేట మండలం, గాజుల భాగ్యలక్ష్మి కొత్తపేట్ గ్రామం బోయిన్పల్లి మండలం, ప్రవీణ్ కుమార్ గుర్రం, సిరికొండ గ్రామం ఇల్లంతకుంట మండలం, పురుషోత్తం గాజుల వీర్నపల్లి గ్రామం వీర్నపల్లి మండలం, బడుగు బాబు మానాల రుద్రంగి మండలం ఉన్నారు.