Wednesday, October 30, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: సీఎం సారూ.. జోక్యం చేసుకోండి

Rajanna Sirisilla: సీఎం సారూ.. జోక్యం చేసుకోండి

ప్రభుత్వాలు మారినా విద్యార్థుల తలరాతలు మారవా?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల వ్యాపారాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు అమ్మోద్దని ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంవల్ల, ప్రైవేట్ విద్యా సంస్థలు సరికొత్త దారుల్ని వెతుక్కున్నాయి. జిరాక్స్ తీసుకుంటే కూడా 300 రూపాయలు కానీ 2000 వసూలు రూపాయలు చేస్తున్నారు.

- Advertisement -

ప్రైవేట్ బుక్ స్టాల్ యజమానులు. ఆయా కేంద్రాల్లో ప్రైవేట్ బుక్ స్టాల్ లో తమ స్కూల్ కు సంబంధించిన పుస్తకాలను అమ్మిస్తూ ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాలు సరికొత్త దారులు వెతుక్కుంటున్నాయి. అసలు ప్రభుత్వం నిష్ణాతులైన అధ్యాపకులచే తయారు చేయించిన పుస్తకాల కంటే, ఈ ప్రైవేటు సంస్థలు తయారుచేస్తున్న పుస్తకాలు గొప్పవా? అలాంటప్పుడు ఈ ప్రభుత్వ పుస్తకాలు ఎందుకు అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. అసలు విద్యాశాఖ సరిగ్గా పనిచేస్తుందా? లేక ప్రైవేటు విద్యా సంస్థలకు వంత పాడుతుందా అనే అనుమానం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా రాష్ట్ర సీఎం, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ జోక్యం చేసుకొని ఈ ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీ నుండి తమను రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News