Sunday, July 7, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: మంత్రగాళ్లపై ఏకకాలంలో దాడులు

Rajanna Sirisilla: మంత్రగాళ్లపై ఏకకాలంలో దాడులు

11 మందిపై కేసులు, 09 మంది బైండోవర్

రాజన్న సిరిసిల్ల జిలాల్లో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకి సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు. మూఢనమ్మకాలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే ఇండ్లు, స్థలలపై ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా,09 మందిని బైండోవర్ చేశారు.

- Advertisement -

కేసులు అయిన వారి వివరాలు..
జవ్వాజి ధనుంజయ్,కోరేం, (బోయినపల్లి),అంబటి నర్సయ్య,రుద్రంగి,బొమ్మేళ మల్లేశం,చంద్రగిరి, (వేములవాడ),ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జగిరి పర్శరాములు అలియాస్ పీర్ బాబా,గొట్టె రామస్వామి,గొట్టె వెంకటరాములు,గొట్టె శ్రీనివాస్,గొట్టె సురేందర్,గొట్టె శ్రీకాంత్,గొట్టె ప్రవీణ్ కుమార్ లు,కడామంచి రామస్వామి, పెద్దూర్,(సిరిసిల్ల టౌన్)లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
బైండోవర్ అయిన వారి వివరాలు..
గొట్టే రవీందర్ (కొనరావుపేట్),గొట్టే రామకృష్ణ (చందుర్తి),గొట్టే దయాకర్(కొనరావుపేట్),మహమ్మద్ మజర్ అలీఖాన్,అన్నలదాస్ దశరతం(తంగల్లపల్లి),కంపెళ్లి మహేష్ (తంగల్లపల్లి),నడికుల నాగేంద్ర,నామపూర్ (ముస్తాబాద్),టేకు నర్సయ్య బాబాజి నగర్,పెద్దూర్ (సిరిసిల్ల),కడమంచి దుర్గయ్య,బాబాజి నగర్ పెద్దూర్ (సిరిసిల్ల) లను బైండోవర్ చేశారు.

వెళ్లాల్సింది భూత వైద్యుల దగ్గరికి కాదు..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలే తప్ప మూఢనమ్మకాలు , చేతబడి, మంత్రాలు, నమ్మి ఇబ్బందుల్లోకి వెళ్లవద్దని, ముఖ్యంగా ఇలాంటివి నమ్మడం వల్ల ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు. ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనారోగ్యంపాలైన వ్యక్తులు భూత వైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని సూచించారు. మంత్రాలు, మూఢనమ్మకాల నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు,ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో నిరక్షరాస్యులతో పాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ శాఖ తరుపున, జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు ద్వారా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరుగుతుందన్నారు. చేతబడి, మంత్రాలు, మూఢనమ్మకాల పేరుతో ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News