Tuesday, September 10, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడాలి

Rajanna Sirisilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడాలి

విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యధావిధిగా కొనసాగాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పవర్లూమ్ యజమానులు, ఆసాములు, సెస్ అధికారులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్తో పోటీపడి తమ ఉత్పత్తులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిరిసిల్ల సెస్ కు బకాయి ఉన్న విద్యుత్ సబ్సిడీ బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,సెస్ ఎండి రవీందర్ రెడ్డి,హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News