Saturday, May 24, 2025
HomeతెలంగాణTirumala: తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయండి: రాజాసింగ్

Tirumala: తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయండి: రాజాసింగ్

తిరుమల(Tirumala) కొండపై నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) డిమాండ్ చేశారు. తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక పవిత్రమైన ఆలయమని చెప్పారు. గతంలోనూ తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి చాలా కుట్రలు జరిగాయన్నారు. ప్రస్తుతం కూడా అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

- Advertisement -

ఏడు కొండలు కాదు.. ఐదు కొండలేనని వైఎస్ఆర్ హయాంలో ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. తర్వాత జగన్ హయాంలో దేవుడి లడ్డు కల్తీ లాంటి అపవిత్ర ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపై నమాజ్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోందన్నారు. నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని టీటీడీని కోరారు. దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డును సిబ్బంది తనిఖీ చేయాలీని విజ్ఞప్తి చేశారు.

కాగా రెండు రోజుల క్రితం తిరుమలలో దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి ఓ వ్యక్తి నమాజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు టీటీడీ సిబ్బంది విజిలెన్స్ విచారణ మొదలు పెట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News