సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో పోలీస్ స్టేషన్ ల పనితీరు ప్రామాణికంగా కేంద్ర హోంశాఖ నిర్వహించిన సర్వేలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.
కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్ రికార్డ్ సృష్టించింది. నమోదైన కేసుల వివరణ, హత్య కేసులో అతి త్వరగా నిందితుల గుర్తింపు, అనేక కేసులను ఛేదించడంలో అత్యంత ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను దేశంలోనే నెంబర్ -1 రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేశారు. దీనితో ఈనెల 5న జైపూర్ లో జరిగే కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు అవార్డు తీసుకోనున్నారు.