Monday, July 8, 2024
HomeతెలంగాణRajendra Nagar: మంత్రి మహేందర్ రెడ్డి ఇంట్లో రక్షాబంధన్ సందడి

Rajendra Nagar: మంత్రి మహేందర్ రెడ్డి ఇంట్లో రక్షాబంధన్ సందడి

మహేందర్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి నర్మదా రెడ్డి

రక్షాబంధన్ విడత రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి ఇంట్లో సందడిగా సాగింది. అనుబంధాలకు, ఆత్మీయతకు ప్రతికగా రక్షాబంధన్ నిలుస్తుంది అని తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు గనులు, భూగర్భవనలు శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రక్షాబంధన్ ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోదరీమణి పీ. నర్మదా రెడ్డి సోదరుడు మంత్రి మహేందర్ రెడ్డికి రాఖీ కట్టారు. అలాగే మంత్రి కుమారుడు పట్నం రినీష్ రెడ్డికి సోదరి మనిషా రెడ్డి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తమ సోదరులు కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డికి సోదరి అనూష రాఖీ కట్టారు. అలాగే కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సోదరి నర్మదా దేవి రాఖీ కట్టారు. అనంతరం పరస్పరం మిఠాయిలు తినిపించారు.

- Advertisement -

తాండూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ మహిళా విభాగం నాయకురాలు దీప మల్లేష్ తదితరులు మహేందర్ రెడ్డి కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలలో మహోన్నతమైంది రక్షాబంధన్ అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న సోదర భావాన్ని, ఆత్మీయతను చాటుకునేందుకు రక్షాబంధన్ ఎంతో దూరం చేస్తుందని అన్నారు. మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మరోసారి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News