జమ్ము కాశ్మీర్ లడక్ నగరంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన వీర జవాన్లకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఆర్మీ డిఫెన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కొవ్వతుల ర్యాలీ నిర్వహించి షాద్నగర్ ముఖ్య కడలిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎం పవన్ చౌహన్ మాట్లాడుతూ..ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. చంద్రశేఖర్ కూడా ఒకప్పుడు ఆర్గనైజేషన్ లో పనిచేశారని ఆయన గుర్తుచేశారు. తెరపై కనిపించే వారు హీరోలు అయితే తెరపై కనిపించకుండా యుద్ధం చేసే సైనికులే రియల్ హీరోస్ అని, ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ మరణం షాద్నగర్ నియోజకవర్గానికి తీరని లోటుగా పేర్కొన్నారు.
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ…కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ప్రేమానురాగాలు పంచుకోకుండా దేశ ప్రజల రక్షణ ధ్యేయంగా భావించి జవాన్ గా ముందు సాగిన చంద్రశేఖర్ కి నివాళులర్పించారు. మీ మరణం వృధా పోదు మీ త్యాగం ఈనేల మరవబోదు అని సంతాపం తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు ఏం పవన్ చౌహన్ , ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ అధ్యక్షులు ఏ.విజయ్ చారి, కార్యదర్శి ఆకాష్ నాయక్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు వరుణ్, ప్రవీణ్, అభిలాష్,సాయి చౌహన్,మహేందర్,కుమార్, సుబ్బు నాయక్, నవ్య, సరిత,సుజాత, అంకిత తదితరులు పాల్గొన్నారు.