రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మైలార్ దేవరపల్లి కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు చేస్తున్న, యువ నాయకుడిగా అనుభవం కలిగిన అసెంబ్లీ పుష్కలంగా ఉండడంతో రాజేంద్ర నగర్ అసెంబ్లీ టికెట్టు భాజపా తరఫున వరించింది. పార్టీలకతీతం సామాన్యుడి సైతం అసెంబ్లీ బరిలో నిలిచి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కేవలం భాజపాకే సాధ్యమవుతుందన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. తన నియామకం కోసం విశేషంగా కృషిచేసిన బిజెపి సీనియర్ నాయకులు కు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం అలాగే తన గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల కష్టసుఖాలు తనకు తెలుసునని, ప్రజల సంతోషమే తన ప్రాథమిక లక్షణం అని అన్నారు. తను సుప్రయోజనాల కోసమో.. లేక స్వార్థ రాజకీయాల కోసమో రాలేదని.. నిజాయితీగా నిస్వార్ధంగా నిక్కసిగా ప్రజాసేవకు పునరంకితమవుదామనే ఏకైక లక్ష్యంతో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. తన జీవితం ప్రజల కోసం తన శ్వాస ప్రజల కోసం తన ఊపిరి ప్రజల కోసం తన సేవలు ప్రజల కోసం తానున్నది ప్రజల కోసమేనని ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, తన మనోభావాన్ని, పరమార్ధాన్ని మీడియా ముందు వెల్లడిస్తున్నానని తెలిపారు. అంతే శ్రీనివాస్ రెడ్డి కు భాజపా టికెట్టు రావడం పట్ల ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు స్థానిక చివరస్తలో బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించారు. జై బిజెపి జై జై బిజెపి.. కాబోయే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.