Sunday, November 16, 2025
HomeతెలంగాణRakhi festival: ప్రముఖులకు రాఖీలు కట్టిన తోబుట్టువులు

Rakhi festival: ప్రముఖులకు రాఖీలు కట్టిన తోబుట్టువులు

ప్రముఖ రాజకీయ నేతల రాఖీ సంబురాలు

గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలువురు ప్రముఖులకు వారి తోబుట్టువులు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సభ్యురాలు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తన సోదరులు రవిచంద్ర, రాజేంద్రప్రసాద్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు చిత్తూనూరు శ్రీనివాస్ లకు రాఖీ కట్టి ఆశీర్వదించారు.

- Advertisement -

ఉగ్గంపల్లిలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ కు రాఖీ కట్టిన సోదరి కౌసల్య.

మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టిన పలువురు మహిళలు.. ఆడబిడ్డల్లాగా అభిమానంతో వచ్చి రాఖీలు కట్టిన మహిళలకు కానుకలు సమర్పించి ఆశీస్సులు తీసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్-డాక్టర్ సీతమహాలక్ష్మి దంపతులు..

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత-భద్రునాయక్ దంపతుల కూతురు మహతి.. ఆమె తోబుట్టువు నయన్ కు రాఖీ కట్టి ఆశీస్సులు అందజేశారు..

తన తోబుట్టువు సూర్యచంద్రతో పాటు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ యండి ఫరీద్, యువజన విభాగం అద్యక్షులు యాళ్ళ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యక్తిగత సహాయకులు గంగాధర్, సతీష్ లకు రాఖీ కట్టిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్-డాక్టర్ సీతమహాలక్ష్మి దంపతుల కూతురు తేజస్విని.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad