Thursday, April 10, 2025
HomeతెలంగాణRamadugu: అల్ఫోర్స్ లో పరివర్తన్- 2024 వేడుకలు

Ramadugu: అల్ఫోర్స్ లో పరివర్తన్- 2024 వేడుకలు

ఉత్సాహంగా సాగిన ..

రామడుగు మండలం గోపాల్ రావుపేట అల్ఫోర్స్ లో పరివర్తన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి. నరేందర్ రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థీదశనుంచే సామాజిక అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లి తండ్రుల ఆశలను నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత విద్యను అభ్యసించి ప్రపంచ నలుదిశలా ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.

విద్యతో పాటు క్రమ శిక్షణకు అల్ఫోర్స్ విద్యార్థులు మార్గదర్శకంగా నిలుస్తారన్నారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News