Sunday, April 13, 2025
HomeతెలంగాణRamadugu: 'హలో రెడ్డి ..చలో కరీంనగర్' వాల్పోస్టర్ ఆవిష్కరణ

Ramadugu: ‘హలో రెడ్డి ..చలో కరీంనగర్’ వాల్పోస్టర్ ఆవిష్కరణ

రామడుగు మండలం వెదిర గ్రామంలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ 6న జిల్లా కేంద్రం కరీంనగర్ లో నిర్వహించే ‘హలో రెడ్డి ..చలో కరీంనగర్’ పేరుతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం వాల్పోస్టర్ను రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ,ప్రతి రెడ్డి బిడ్డ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .ప్రభుత్వం 2018 లో మేనిఫెస్టో ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ నేటికీ ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డిలను అణచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి దొడ్డ లచ్చిరెడ్డి ,వెదిర గ్రామారెడ్డి సంఘం అధ్యక్షుడు వంగల భూమిరెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు గిరి శ్రీనివాస్ రెడ్డి, పన్యాల అశోక్ రెడ్డి ,వంచ రాజిరెడ్డి, రాళ్ల బండి శ్రీనివాస్ రెడ్డి ,రాళ్ల బండి సంతోష్ రెడ్డి ,దొడ్డ లచ్చిరెడ్డి, తిరుపతిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,ఎడవెల్లి రాజిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి నాతో పాటుగా పలువురు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News