ఎట్టకేలకు ఫలించిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం కృషితో రామడుగు నూతన బ్రిడ్జి నుండి రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత ఐదు సంవత్సరాల క్రితం ఏడు కోట్ల 90 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టి పూర్తిచేసిన గాని దాని నుండి రాకపోకలు ప్రారంభించలేదు. భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోయే రైతులకు నయా పైసా ఇవ్వకుండా బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన గాని భూ బాధితులకు డబ్బులు రాకపోవడంతో వారు వంతెన ప్రారంభిస్తే మా డబ్బులు రావని మా డబ్బులు ఇప్పిస్తే గాని వంతెన రాకపోకలకు అడ్డురామని భూపాధితులు పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రామడుగు పాత బ్రిడ్జి పూర్తిగా తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. అది తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హుటాహుటిన రామడుగు వంతెన వద్దకు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చి భూ బాధితులతో మాట్లాడి కలెక్టర్ తో మాట్లాడించి భూ బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తానని మెప్పించి ఒప్పించి ఎట్టకేలకు బ్రిడ్జి రాకపోకల పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.
వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు రామడుగు మండల ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ ,ఎమ్మార్వో వెంకటలక్ష్మి ,ఎంపీడీవో రాజేశ్వరి ,చొప్పదండి సిఐ ,గంగాధర ,రామడుగు, చొప్పదండి ఎస్ఐలు, ఆర్ ఐ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.