Friday, November 22, 2024
HomeతెలంగాణRamadugu: పదవి మహిళలది పెత్తనం భర్తలది

Ramadugu: పదవి మహిళలది పెత్తనం భర్తలది

సతుల స్థానంలో పతుల భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారిక్కడ. రామడుగు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామడుగు ఎంపీపీ కలిగేటి కవితకు బదులు ఆమె భర్త కలిగేటి లక్ష్మణ్ హాజరవ్వటం విశేషం. అదేవిధంగా మహిళా సర్పంచ్ల స్థానంలో కూడా భర్తలు పెత్తనాన్ని చలాయిస్తున్నారు. వెరసి.. పేరు భార్యది పెత్తనం భర్తదిగా ఇక్కడ పరిస్థితి తయారైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికార కార్యక్రమాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే అనధికారిక వ్యవహారాల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించాలనే మాటలను ఖాతరు చేసేవారే లేకుండా పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News