Saturday, November 23, 2024
HomeతెలంగాణRamagundam: నూతన పోలీస్ కమిషనరేట్ భవనంలో సిపి సమీక్ష

Ramagundam: నూతన పోలీస్ కమిషనరేట్ భవనంలో సిపి సమీక్ష

రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం జరిగిన తరువాత మొదటి సారిగా రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ (డి.ఐ.జి) మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా జోన్ పరిధి పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలుగా నిర్వహించిన స్పోర్ట్స్ మీట్, ఇట్టి కమిషనరేట్ పరిధిలోని మారుమూల ప్రాంతం వరకు కూడా నేరా నియంత్రణ, ప్రజల రక్షణ కోసం సిసి కెమెరాల ఏర్పాటు, కమిషనరేట్ పోలీస్ ఆఫీస్ ప్రారంభం కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఐదు వందల పోలీస్ అధికారులకు, సిబ్బందికి మెగా రివార్డ్ మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ… నూతన పోలీస్ కమిషనరేట్ భవనంలో అన్ని విభాగలకి సంబంధించిన కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల అనుగుణంగా, భవిష్యత్తు ప్రణాళిక తో ఇట్టి నిర్మాణంని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు పూర్తి రక్షణ, భద్రత కల్పించుటకు వినూత్నమైన, సంస్థాగతమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. పోలీస్ అధికారులు సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందిస్తాం అని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ నూతన భవనం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యుత్ ను మరియు నీటిని వృధా చేయకూడదని సూచించారు. బిల్డింగ్ మెయింటైనేన్స్ కోసం వివిధ వింగ్స్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం , రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో భవిష్యత్తు లో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,అమ్మకం పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్, (డి.ఐ.జి) గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా చూడాలని అన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని సీపీ సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి గ్రామంలో సుమారు రెండు సిసి కేమరాల ఏర్పాటులో భాగంగా ప్రజలను అవగాహన పరుస్తూ సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అందరు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గత రెండు నెలలలో ప్రతి గ్రామల్లో రెండు సిసి కెమెరాల ఏర్పాటులో భాగంగా 648 గ్రామాలు మరియు 110 ఆమ్లెట్ గ్రామాలలో 2978 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో సాంకేతికపరమైన సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న షీ టీమ్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్లకు కొత్తగా హాట్ స్పాట్ లను గుర్తించి అట్టి ప్రాంతాలలో నిగవ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కి కళాశాలలకి సెలవులు కావున విద్యార్థిని విద్యార్థులు ప్రలోభాలకు, ఆకర్షణలకు గురై ఇంటి నుండి వెళ్లిపోవడం భవిష్యత్తు నాశనం చేసుకోవడం వంటి పనులు చేయడం జరుగుతుంది. షీ టీమ్స్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, ట్రైనింగ్ లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకెన్ ఐపీఎస్., పెద్దపల్లి డిసిపి వైభవ్ ఐపీఎస్, ఏఆర్ అడిషనల్ డిసిపి రియాజ్ ఫుల్ హక్, కమిషన్ పరిధిలోని ఏసీపీలు, సిఐలు, ఆర్ఐ లు,ఎస్సైలు, ఆర్ ఎస్ఐ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News