Damodhar reddy death: అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) ఇవాళ రాత్రి 10.10 నిమిషాలకు ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రిలో చేర్చగా ఇవాళ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. దామోదర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. దామోదర్ రెడ్డి మరణంతో తెలంగాణ కాంగ్రెస్కు పెద్ద దిక్కును కోల్పోయినట్లైంది. అయితే, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ramreddy Damodar Reddy: టీకాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


