Sunday, July 7, 2024
HomeతెలంగాణRamulu Naik: రైతును రారాజు చేయడమే కెసిఆర్ లక్ష్యం

Ramulu Naik: రైతును రారాజు చేయడమే కెసిఆర్ లక్ష్యం

వైరా రిజర్వాయర్ నీటి విడుదల సమీక్ష సమావేశం

వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా రిజర్వాయర్ ఆయికట్టు రైతులతో నీటి విడుదలపై సమీక్ష సమావేశం సాగింది. నీటిపారుదల శాఖ.ఈ.ఈ. బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా శాసనసభ్యులు రాములు నాయక్ హాజరయ్యారు. మధిర మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి లేకుండా సంవత్సరానికి రెండు పంటలకు నీరు అందిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్ ,జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ ,జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునురావు ,జిల్లా సీనియర్ నాయకులు జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు మచ్చా నర్సింహారావు , జిల్లా రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, మండల రైతు బంధు కన్వీనర్ రవీందర్ రెడ్డి,వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు మోరంపూడి బాబు, మచ్చా బుజ్జి, ఏవో పవన్, డి ఈ శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు కరుణాకర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బీబా సాహెబ్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, పట్టణ నాయకులు సూర్యదేవర శ్రీధర్, కర్నాటి హనుమంతరావు ,తాటిపల్లి సుధీర్, సిపిఎం నాయకులు తోట నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు పారుపల్లి కృష్ణారావు, పరుచూరి రామ్ కుమార్ రావ్ , కంచర్ల నాగేశ్వరరావు, తడికమళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News