Saturday, November 23, 2024
HomeతెలంగాణRamulu Nayak: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Ramulu Nayak: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్‌ ఐకెపి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి మహిళా సంక్షేమ దినోత్సవం ఏన్కూరు కమ్మవారి కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది.

- Advertisement -

అధికారులు, ప్రజా ప్రతినిధులు,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై,కోలాటాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, బతుకమ్మలతో ఎమ్మెల్యే రాములు నాయక్‌ కు ఘన స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్‌ నుండి, సభా వేదిక వరకు మహిళలు ర్యాలీగా చేరుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ హాజరై ప్రసంగిస్తూ కళ్యాణ్‌ లక్ష్మి,షాది ముబారక్‌, ఆసరా పెన్షన్లు ఇస్తూ పెద్దన్నగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

చాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ అని గుర్తు చేశారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలవడం గర్వకారణం అన్నారు. మహిళలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. లక్షా 26 వేల మందికి,9 కోట్ల రూపాయలను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి పథకంలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న కెసిఆర్‌కు అండగా నిలవాలని కోరారు.


మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సాహాన్నందిస్తూ సమాజంలో మహిళలకు గౌరవాన్ని కల్పిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకుని ఏన్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డ పుట్టిన వెంటనే కెసిఆర్‌ కిట్‌ అందించడం నుండి కే.జి నుండి పి.జి వరకు ఉచిత విద్యనందించి, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపుకు తొడ్పాటునందిస్తుందన్నారు ఆడపిల్ల పెండ్లికి తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మీ ఆర్ధిక చేయూత నందిస్తుందన్నారు.


ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీలు ఆరెం వరలక్ష్మి, మాలోతు శకుంతల, పావని, జడ్పిటిసిలు బాదావత్‌ బుజ్జి, నంబూరి కనకదుర్గ, సర్పంచులు చిర్రా రుక్మిణి, భూక్య క్రాంతి, ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి,సిడిపిఓ దయామని, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు వెంకటమ్మ, రేఖాభాయి, ఎంపీడీవో బయ్యారపు అశోక్‌, ఐకెపి ఎపిఎం హరి నారాయణ, తహసిల్దార్‌ ముజాహిద్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ధర్మారావు, బి ఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్‌ సురేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News