వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన తెలుసుకో రైతన్న మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా…! మూడు పంటలకు నీరు అందించిన కేసీఆర్ కావాలా…!నియోజవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా డిసిసిబి జిల్లా అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాతమధు, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒడిలో రైతులు ప్రశాంతంగా ఉన్నారని, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్ద కొడుకు అయ్యి రైతు వ్యవసాయాన్ని పండుగలా చూసుకుంటుంటే 24 గంటల కరెంటు దండగ అని కాంగ్రెస్ నాయకులు అనడం ఎంత వరకు న్యాయమని అన్నారు.
రైతు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కూడా తెలంగాణ ప్రభుత్వమే రావాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుడై కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.