Friday, April 18, 2025
HomeతెలంగాణRani Rudrama: సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా

Rani Rudrama: సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా

నా పేరేంటో తెలుసా అంటూ పిల్లలతో మాట కలిపిన రాణి

సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట, అల్మాస్పూర్, అక్కపల్లి గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రాణి రుద్రమ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు తీర్చి అభివృద్ధి చేస్తానని అన్నారు.

- Advertisement -

బడి పిల్లలను పలకరించిన రాణి రుద్రమ..
ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బస్సులో వెళ్తున్న బడి పిల్లలు సంతోషంగా రాణి రుద్రమాను పలకరించడంతో నా పేరేంటో తెలుసా అని పిల్లల్ని అడగగా.. వారు సంతోషంతో రాణి రుద్రమ అంటూ అరుపులు వేశారు. బస్సులోని పిల్లలతో తమ తల్లిదండ్రులకు చెప్పి కమలం గుర్తుపై ఓటు వేయించాలని పిల్లలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డబోయిన గోపి, రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి, నేవూరి దేవేందర్ రెడ్డి, బందారపు లక్ష్మారెడ్డి,కోనేటి సాయిలు, చందుపట్ల లక్ష్మారెడ్డి, సత్యం రెడ్డి, శరత్ రెడ్డి బాపురెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News