Saturday, November 23, 2024
HomeతెలంగాణRasamai Balakishan: మానకొండూరులో ఘనంగా సాగునీటి దినోత్సవం

Rasamai Balakishan: మానకొండూరులో ఘనంగా సాగునీటి దినోత్సవం

ఉద్యమం పురుడు పోసుకున్నది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాల మీదే

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సాగునీటి దినోత్సవ వేడుకలను అల్గునూర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ్మాగార్డెన్ లో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్, కరీంనగర్ జడ్పీ సీఈవో ప్రియాంక కర్నన్ లు హాజరయ్యారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రత్యేక సంచిక, డైరీని ఆవిష్కరించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఈఈ, ఉత్సవాల కో-ఆర్డినేటర్ పెద్ది రమేశ్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంలో త్రాగు, సాగునీటి రంగంలో సాధించిన అభివృద్ధిపై సంక్షిప్త నివేదికను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమం పురుడు పోసు కున్నది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాల మీదనే అని, సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలో సాగు మాట దేవుడెరుగు, కనీసం గ్రామాలలో త్రాగడానికి నీళ్లు కూడా దొరికేవికావు, వేసవికాలం వచ్చిందంటే గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోయి త్రాగునీటి కటకటతో దుర్భరమైన పరిస్థితులు నాడు తెలంగాణలో ఉండేవి. అలాంటిది తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో కేవలం 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో త్రాగు, సాగునీటి రంగంలో విశేష ప్రగతిని సాధించామని, స్వల్ప వ్యవధిలోనే కాలేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించి, గోదావరి నీళ్లను ఒడిసిబట్టి, మిషన్ కాకతీయ ద్వారా దిగువ నుండి ఎగువకు నీటిని పంపింగ్ చేసి, దాని ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నీటితో నింపి భూగర్భ జలా లను అడుగంటి పోకుండా కాపాడుతూ, సాగునీటి రంగంలో ఆయకట్టు అభివృద్ధితో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, 3 పంటలకు సరిపడే విధంగా సాగునీటిని అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, జడ్పిటిసిలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ ఈఈ, ఉత్సవాల కో-ఆర్డినేటర్ పెద్ది రమేశ్, టీఎన్జీవో నాయకులు సంగే లక్ష్మణ్ రావు, పోలు కిషన్, జి.నరోత్తం రెడ్డిలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సాగునీటి సంఘాల నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News