బీసీల అభివృద్దే బీ.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసన సభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు మంజూరైన లక్ష రూపాయల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణి చేశారు. పల్లెల్లు ప్రగతికి పట్టు కొమ్మలని, బీసి కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే రసమయి.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Rasamai Balakishan: బీసీల అభివృద్దే పార్టీ లక్ష్యం
బీసీ బంధు చెక్కుల పంపిణీ